Tuesday, April 8, 2025

అధికారులే నిజమైన అంధులు…. హైకోర్టు సీరియస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. అంధులను కోర్టుల చుట్టూ తిప్పుతు న్నారని మండిపడింది. వికలాంగులు బాధితులు కాదని, అధికారులే నిజమైన అంధులు అని జస్టిస్ భీమపాక నగేశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంధులను కోర్టుల చుట్టూ తిప్పడంపై మండిపడ్డారు. కొందరు అధికారుల తీరు వల్ల అంధుల ఉద్యోగ జీవితం మసకబారుతోం దని అన్నారు. తమను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ కొందరు అంధులు హైకోర్టును ఆశ్రయిం చారు.

వేర్వేరు కారణాలతో తొలగించడంపై ఎనిమిదేళ్లుగా వారు న్యాయపోరాటం చేస్తున్నారు. వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి కారణమైన అధికారులపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాల నుంచి తొలగించడంపై 2017లో అంధ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారించి పైవ్యాఖ్యలు చేసింది. అధికారుల పనితీరు, నిర్లక్ష్యం కారణంగా తాము ఎంతో నష్టపోయామని వికలాంగులు ఆవేదన చెందారు. మరోవైపు రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా వారిని చిన్నచూపు చూస్తున్నారని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నేతలు అన్నారు.

రాష్ట్రంలో 30 లక్షల మంది దివ్యాంగులు అనేక సమస్యలతో అల్లాడిపోతూ దుర్భర జీవితాలు గడుపుతున్నా రని, తక్షణమే ప్రభుత్వం స్పందించి, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచుతామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామ్ని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసి తక్షణమే అమ లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News