నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో అక్రమాలు జరిగాయన్న బిజెపి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మునుగోడు ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో నివేదిక సమర్పించింది. 2018 అక్టోబరు 12న మునుగోడు ఓటర్ల సంఖ్య 2,14,847గా ఉందని సిఇఒ వికాస్ రాజ్ తెలిపాడు. ఈనెల 11 నాటికి మునుగోడు ఓటర్ల సంఖ్య 2,38,759గా పెరిగిందన్నాడు. 25,013 కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని, కానీ 12,249 కొత్త ఓటర్లకు అనుమతించి ఇచ్చామని, 7247 తిరస్కరించామన్నాడు. 5,517 ఫారం 6 పెండింగులో ఉందని, మునుగోడు ఓటరు జాబితా సవరణ శుక్రవారం పూర్తవుతుందని సిఇఒ తెలిపాడు. మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. మునుగోడు ఓటరు జాబితాపై విచారణ ఈ నెల 21కి కోర్టు వాయిదా వేసింది. సవరించిన ఓటరు జాబితా సమర్పించాలని ఇసికి హైకోర్టు ఆదేశించింది.
మునుగోడు ఉప ఎన్నిక… హైకోర్టులో బిజెపికి షాక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -