Sunday, January 19, 2025

ఆ వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పై సిజె ధర్మాసనం విచారణ చేపట్టింది. జడ్జిలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని ధర్మాసనం పేర్కొంది. కొన్ని పత్రికలు జడ్జి పేరు, మొబైల్ నంబర్ ప్రచురించినట్లు హైకోర్టు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ పై మీడియా సంయమనం, బాధ్యతో వ్యవహరించాలని, ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారని. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని వివరించింది. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని, విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పలువురు పోలీసు అధికారులు ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News