Saturday, January 4, 2025

చేసింది చాలు.. ఇక ఆపండి

- Advertisement -
- Advertisement -

ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ పరిధి తేల్చకుండా ఎలా
కూల్చివేతలు చేపడతారని నిలదీత
నోటీసులు జారీ చేసిన 24గంటల్లోనే చర్యలా?
ఇది పునరావృతమైతే కమిషనర్‌ను కోర్టుకు
పిలవాల్సి వస్త్తుందని హైకోర్టు హెచ్చరిక

మనతెలంగాణ/సిటిబ్యూరో: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనా థ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక ఆపండంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతలపై అంశంపై హైకోర్టులో మంగళవారం నాడు విచార ణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు విన్న న్యాయమూర్తి హైడ్రా తీరు పై కన్నెర్ర జేశారు. కూల్చివేతలు చేపట్టిన భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉ న్నట్లు ఎలా చెబుతున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆధారాలు ఉ న్నాయా? అని హైడ్రాను నిలదీసింది, పిటిషనర్ వద్ద అన్ని డాక్యూ మెంట్స్ ఉన్నాయి కదా? అని హైడ్రాను ప్రశ్నించింది కోర్టు. ఎఫ్‌టీఎల్, బ ఫర్ జోన్ పరిధి తేల్చకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని నిలదీసింది.

వెంటనే కమిషనర్‌కు చెప్పి కూల్చివేతలు ఆపివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. లేదంటే తాము ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటివి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు . ఇదే సమయంలో పిటిషనర్‌కు కూడా కీలక ఆదేశాలిచ్చింది హైకోర్టు ధర్మాసనం. పిటిషనర్ కూడా జీహెచ్‌ఎంసీ పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అన్నారు. పిటిషనర్ వేసిన తాత్కాలిక ఫెన్సింగ్ కూడా 24 గంటల్లో పిటిషనరే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News