Sunday, December 22, 2024

చిక్కుల్లో సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

ముడా భూ కుంభకోణంలో కర్నాటక ముఖ్యమంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ
దర్యాప్తునకు గవర్నర్ అనుమతి ఇవ్వడం సరైనదేనన్న ధర్మాసనం
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది..నిజం గెలుస్తుంది: సిద్ధరామయ్య 
ముఖ్యమంత్రి రాజీనామాకు విపక్షాల పట్టు
ఆయన వెంటే ఉంటాం : డికె

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంగళవారం రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఒక స్థలం కేటాయింపు కేసులో తనపై దర్యాప్తునకు గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసిం ది. ఒక ప్రధాన ప్రాంతంలో సిద్ధరామయ్య భా ర్యకు మైసూరు పట్టణ అభివృద్ధి ప్రాధికార సం స్థ (ముడా) 14 స్థలాలు కేటాయించడంలో అ క్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తనపై దర్యాప్తునకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన అ నుమతిని ముఖ్యమంత్రి సవాల్ చేశారు. ఆ గస్టు 19 నుంచి ఆరు సిట్టింగ్‌లలో పిటిషన్‌పై విచారణను పూర్తి చేసిన తరువాత జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ఏక సభ్య ధర్మాసనం త న ఉత్తర్వును ఈ నెల 12న రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఆయనపై ఫిర్యాదులు విచారించవలసి ఉన్న ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానాన్ని తాజా పిటిషన్‌పై నిర్ణ యం వెలువడే వరకు విచారణను వాయిదా వేయాలని ఆదేశిస్తున్న తన ఆగస్టు 19 నాటి ఉత్తర్వు గడువును కూడా పొడిగించింది. ‘పిటిషన్‌లో ఉటంకించిన అంశాలు నిస్సందేహంగా దర్యాప్తునకు అర్హమైనవి.

ఈ చర్యల లబ్ధిదారు వేరే ఎవరో కాకుండా సాక్షాత్తు పిటిషనర్ కుటుంబం అన్నది నగ్న సత్యం. పిటిషన్‌ను కొట్టివేయడమైంది’ అని జస్టిస్ నాగప్రసన్న తీర్పు ఇచ్చారు. ‘ఇప్పటికీ అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వు రద్దు అవుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఫిర్యాదీలు ప్రదీప్ కుమార్ ఎస్‌పి, టిజె అబ్రహామ్, స్నేహమయి కృష్ణ తనకు సమర్పించిన పిటిషన్లలో ప్రస్తావించిన నేరాలకు పాల్పడినందుకు అవినీతి నిరోధక చట్టం (పిసిఎ) 1988లోని సెక్షన్ 17ఎ, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 218 కింద గవర్నర్ ఆగస్టు 16న అనుమతి మంజూరు చేశారు, గవర్నర్ ఉత్తర్వు చట్టబద్ధతను సిద్ధరామయ్య ఆగస్టు 19న హైకోర్టులో సవాల్ చేశారు.

విజ్ఞతతో వ్యవహరించకుండా, భారత రాజ్యాంగం 163 అధికరణం కింద తప్పనిసరి అయిన మంత్రి మండలి సలహాతో సహా రాజ్యాంగ సూత్రాలు, చట్టబడ్ధమైన ఆదేశాలకు విరుద్ధంగా అనుమతి ఉత్తర్వు జారీ చేశారని ముఖ్యమంత్రి తన పిటిషన్‌లో వాదించారు. కేసును సమగ్రంగా పరిశీలిస్తే, ఫిర్యాదీలు గవర్నర్ వద్ద ఫిర్యాదును నమోదు చేయడం లేదా అనుమతి కోరడం సమర్థనీయమేనని జస్టిస్ నాగప్రసన్న చెప్పారు. పిసి చట్టం సెక్షన్ 17ఎ కింద అనుమతి ఈ పరిస్థితిలో తప్పనిసరి అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘అయితే, (గవర్నర్) అసాధారణ పరిస్థితుల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ కేసు అటువంటి మినహాయిం పు ఇస్తున్నది’ అని తెలిపారు. గవర్నర్ ఉత్తర్వులో విజ్ఞతను ఉపయోగించకపోవడం అన్నది ఎక్కడా లేదని న్యాయమూర్తి చెబుతూ, ‘గవర్నర్ పూర్తిగా విజ్ఞతను ఉపయోగించిన కేసు’ అని అన్నారు.

నిజం తేలుతుంది : సిద్ధరామయ్య
ముడా భూ కుంభకోణం కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న సిఎం సిద్ధరామయ్య న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. ‘నేను చట్టాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసిస్తాను,నిజం గెలుస్తుంది’ అని సిద్ధరామయ్య అన్నారు. అధికార బిజెపి‘ప్రతీకార రాజకీయాలను’ ఆయన దుయ్యబట్టారు. భూ కుంభకోణం ఆరోపణలను ‘బూటకం’గా సిఎం కొట్టివేశారు. సిద్ధరామయ్య తప్పు ఏమీ చేయలేదని, ఆయన నిష్కళంకంగా బయటకు వస్తారని శివకుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుపై సిఎం రాజీనామాను బిజెపి కోరుతుండడం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు శివకుమార్ సమాధానం ఇస్తూ, ‘ఆ ప్రశ్నే లేదన్నారు. అయితే బిజెపి ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News