Thursday, December 19, 2024

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాక్ !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు పెద్ద షాక్ ఇచ్చింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని రామ్ గోపాల్ వర్మ పెట్టుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లను కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టాడని మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించగా, నేడు ఆయన పిటిషనపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News