Sunday, December 22, 2024

భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు… భార్యకు చీవాట్లు… స్టే విధించిన కోర్టు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తనని భర్త వేధిస్తున్నాడని భార్య మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె వాదన సరైందని కాదు అని, నమోదైన కేసును కొట్టేయాలని భర్త హైకోర్టును ఆశ్రయించిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. ఈ కేసులో విచారణలో భాగంగా జస్టిస్ ఎం నాగ ప్రసన్న ఆశ్చర్యపోయారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తనని భర్త తిననివ్వడం లేదని భార్య ఫిర్యాదు చేసింది. కాన్పు అనంతరం ఫౌష్టికాహారం, పండ్లు, పాలు తదితరాల బదులుగా బంగాళ దంపులతో తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్నందకు తనపైన పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందన్ని కోర్టులో భర్త తెలిపాడు. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని తినొద్దని చెప్పినందుకు భర్తపై కేసు పెట్టడం సరికాదని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అన్ని చోట్లా అతనిపై నమోదైన కేసులపై హైకోర్టు స్టే విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News