Sunday, January 19, 2025

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల ప్రమాణస్వీకారంపై హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ కోటా ఎంఎల్‌సి నియామకాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కో టాలో ఎంఎల్‌సిలుగా ప్రొఫెసర్ కోదండరా మ్, అమీర్ అలీఖాన్‌ల పేర్లను ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రభుత్వ సిఫారసుకు గవర్న ర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ లు సోమవారమే ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ మండలి చైర్మెన్ అందుబాటులో లేని కారణంగా ఈ కార్యక్రమం జరగలేదు. మంగళవారం వీరిద్దరూ ప్రమాణం చేయాల్సి ఉంది.

ఈ తరుణంలో హైకోర్టు నిర్ణయం వెలువడిం ది. దీంతో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ల ప్రమాణానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వు లు వచ్చే వరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రమాణం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎంఎల్‌సి ప దవులకు సిఫారసు చేసింది. అయితే వీరిద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ సాగుతుంది. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దరిమిలా కాంగ్రెస్‌ప్రభుత్వం గతంలో పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటాలోని ఎంఎల్‌సి స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ల పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఈ నెల 25న సిఫారసులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News