Monday, November 18, 2024

మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

High Court Stay on Shifting of Medchal ITI College

మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ ఐటిఐ తరలించకుండా చూడాలని కోరుతూ 132 మంది విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు లేఖ రాసిన నేపథ్యంలో ఐటిఐ కళాశాల తరలింపుపై బుధవారం నాడు స్టే విధించింది. రాశారు. ఐటీఐని అక్కడి నుంచి దూరంగా తరలించి ఆ భూమిని కంపెనీలకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని లేఖలో విద్యార్థులు ఆరోపించారు. దూరంగా తరలిస్తే ప్రయాణానికి ఇబ్బంది పడతామని వాపోయారు. ఎక్కువ మంది విద్యార్థులు స్థానికంగా పరిశ్రమల్లో పార్ట్ టైం ఉద్యోగులు చేస్తూ చదువుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఈక్రమంలో విద్యార్థుల లేఖను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన సిజె ధర్మాసనం విచారణ చేపట్టింది. ఐటిఐ తరలిస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రయాణ ఛార్జీలు భరించలేరని పార్ట్ టైం ఉద్యోగాలు కూడా కోల్పోతారని పేర్కొంది. పూర్తి వివరాలతో 8 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది.

High Court Stay on Shifting of Medchal ITI College

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News