Tuesday, December 24, 2024

సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభు త్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరు తూ ప్రభుత్వంతో పాటు డిజిపి, సిట్, సైబరాబాద్ సిపి, రాజేంద్రనగర్ ఎసిపి, మొయినాబాద్ పోలీసు లు కలిసి అప్పీలు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ప లు అంశాలను, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోలేదని అప్పీలులో ప్రభుత్వం పేర్కొంది. సింగిల్ జడ్జి పిటిషన్‌పై తన పరిధిని కూడా దాటి ఆ దేశాలు జారీ చేశారని తెలిపింది. రాష్ట్ర పోలీసు వ్య వస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా సింగిల్ జడ్జి తీర్పు ఉందని పేర్కొన్నారు. ఈ కేసును కేంద్రం పరిధిలోని సిబిఐకి అప్పగించడమంటే కేసు అవసరం లేదన్నట్లేనని ప్రభుత్వం అప్పీల్‌లో తెలిపిం ది.ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను రద్దు చేయాలని, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును కొట్టివేయాలని పిటిషనర్లే కోరలేదని ప్రభుత్వం హైకోర్టులో పేర్కొంది.

సిబిఐకి ఇవ్వడానికి సిఎం మీడియా సమావేశాన్ని కా రణంగా చూపడం తగదని తెలిపింది. సిఎం ప్రెస్‌మీట్‌ను ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగా చూడాలని, ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలను దేశప్రజలకు తెలిపే ప్రయత్నమే సిఎం వ్యాఖ్యలని వివరించింది. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కు ట్ర జరిగిందని ఓ రాజకీయ పార్టీ నేతగా సిఎం మా ట్లాడారన్నారు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లే దందని చెప్పింది. ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు నిందితుల కుట్రను దేశ ప్రజలకు తెలిపి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగానే సిఎం మీ డియా సమావేశాన్ని చూడాలని అప్పీలులో ప్రభు త్వం వివరించింది. ఫిర్యాదు, ఎఫ్‌ఎస్‌ఐఆర్, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఇతర అంశాల ఆధారంగానే ము ఖ్యమంత్రి మాట్లాడారని తెలిపింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు జాతీ య పార్టీని ఉద్దేశించినవే తప్ప.. దర్యాప్తునకు సంబంధంలేదని పే ర్కొంది.

సమావేశంలో సిఎం వ్యాఖ్యలతో దర్యాప్తునకు సం బంధం లేదని, సిఎంకు సిడిలు ఎలా చేరాయో మి స్టరీగా ఉందనేది సంబంధం లేని అంశమని తెలిపింది. సిఎం వీడియోలను బహిరంగపరిచారు కా బట్టి సిట్ వల్ల ఉపయోగం లేదనడం ఊహాజనితమ ని వివరించారు. సిఎంకు సిడిలు ఎలా చేరాయో న్యాయవాదులెవరూ వివరించలేదనడం పొరపాట ని సర్కారు పేర్కొంది. పిటిషన్‌లో ముఖ్యమంత్రి ప్రతివాదిగా లేరు కాబట్టి ఆయన తరఫున ఏ న్యాయవాది వాదించలేదని స్పష్టం చేసింది. పిటిషన్‌లో ప్రతివాదిగా లేని సిఎం వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం తగదని ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది.
అభ్యంతరముంటే ఛార్జిషీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చు
నిందితులకు దర్యాప్తు సంస్థలను ఎంచుకునే హక్కు ఉండదని అప్పీలులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సిట్‌పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో వివరించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. యూట్యూబ్‌లోని వీడియోలను పరిగణనలోకి తీసుకోవడం చట్టబద్ధం కాదని పేర్కొంది. యూట్యూట్‌లో వీడియోలు ఉండటం నిందితులకు న్యాయపరంగా నష్టమెలాగో వివరించలేదని తెలిపింది. ప్రభుత్వాన్ని కూల్చబోయారన్న ఇలాంటి తీవ్రమైన అంశాలపై మీడియా విస్తృత ప్రచారం ఆశ్చర్యమేమీ కాదని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నిందన్నదే ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన సారాంశమని… అలాంటప్పుడు కేంద్రం పరిధిలోని సిబిఐకి ఇవ్వడమంటే కేసు అవసరం లేదన్నట్టేనని అప్పీలులో ప్రభు త్వం పేర్కొంది.

సింగిల్ జడ్జీ తీర్పు రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ఉందని పేర్కొంది. చట్టానికి అనుగుణంగానే కేసు దర్యాప్తు సాగుతుందని.. నిందితులకు అభ్యంతరముంటే ఛార్జిషీట్ వేసిన తర్వాత సవాల్ చేసుకోవచ్చునని పేర్కొంది. ప్రభుత్వ అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News