Sunday, December 22, 2024

గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గవర్నర్ కోట ఎంఎల్సీ పిటీషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణలు ఎన్నికను గవర్నర్ పున:పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటీషన్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గతంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశాన్ని హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి వర్గం నిర్ణయం తీసుకొని గవర్నర్ కు తెలపాలని హైకోర్టు సూచించింది. దాశోజు శ్రవణ్, కూర సత్యనారాయణల ఎన్నిక ను గవర్నర్ పున:పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టేసింది.  గతంలో కోదండరాం, అమీర్ అలీఖాన్‌ నియమిస్తు కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్‌ ఇచ్చింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు సూచించింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టాలని న్యాయస్థానం పేర్కొంది. కోదండరాం, అమీర్‌ అలీఖాన్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌కు లేదని వివరించింది. కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్ప తిరస్కరించకూడదని గవర్నర్ కు హైకోర్టు చురకలంటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News