Friday, January 10, 2025

శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని మహబూబ్ నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు 2019లో హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రీనివాస్ గౌడ్ ఎంఎల్‌ఎగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రాఘవేంద్రరాజు పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలు పరిశీలించాలని ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది.

Also Read: రూ. 4 కోట్ల డిపాజిట్లు స్వాహా: పోస్టుమాస్టర్ పరారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News