Monday, December 23, 2024

సునీల్ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసుల ఎదురు హాజరు కావాల్సిందేనని సునీల్ కనుగోలుకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని మంగళవారం విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఈ నెల 8వ తేదీన పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలును హైకోర్టు ఆదేశించింది. కాగా, తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మీమ్స్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సిఆర్‌పిసి 41(ఎ) కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆర్.సామ్రాట్ ఫిర్యాదుతో గతేడాది నవంబర్ 24న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. దీని దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంగా పోలీసులు ఈ నెల 13న రాత్రి మాదాపూర్‌లోని మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయంపై దాడి చేయగా, అప్పుడే ఇది కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌లో తెలిసింది. అక్కడ పట్టుబడిన ముగ్గురి విచారణలో సునీల్ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. విచారణకు రాకపోతే అరెస్టు సహా ఇతర చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు.

దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 41 ఎ సిఆర్‌పిసి సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు…సునీల్ కనుగోలు కచ్చితంగా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అదే సమయంలో సునీల్ కనుగోలును అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News