Tuesday, September 17, 2024

నాలుగు వారాల్లో తేల్చండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ మారిన ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై హై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్ల ను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని శాసనసభ సెక్రెటరీని ఆదేశించింది. నాలుగు వా రాల్లో నిర్ణయం తీసుకొని స్టేటస్ రిపోర్టు తెలియజేయాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే తామే సుమోటోగా నిర్ణయం తీసుకుంటామని కూ డా తేల్చి చెప్పింది. బిఆర్‌ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై గెలిచిన ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వు పార్టీ మారారని, వాళ్లపై అనర్హత వేటు వే యాలని ఈ మేరకు స్పీకర్‌కు ఆదేశాలు ఇ వ్వాలని బిఆర్‌ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసిం ది. ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్‌రెడ్డి, కెపి వివేకానందతో పాటు బిజెపి ఎంఎల్‌ఎ మహేశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్‌లో దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ఆగస్టు ఏడో తే దీనే వాదనలు పూర్తి అయ్యాయి. అనంతరం తీర్పును రిజ్వర్ చేస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది.నెల రోజుల తర్వాత సోమవారం తీర్పు వెల్లడించింది. ఒక పార్టీపై గెలిచిన ఎంఎల్‌ఎలు అధికార పార్టీలో చేరడం సరికాదని వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఫిర్యాదు చేశా రు.

అయితే స్పీకర్ నుంచి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం లో కాలయాపన జరుగుతుంటే కచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కోర్టు ముందు ఉంచారు. తాము మార్చిలోనే స్పీకర్‌కు ఈ ఎంఎల్‌ఎలపై ఫిర్యాదు చేశామని వాదనల్లో వెల్లడించారు. దాదాపు ఐదు నెలలకు పైగా అయిపోయిందని తెలిపారు. మణిపూర్ ఎంఎల్‌ఎల కేసును కూడా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. 142 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు స్పీకర్‌కు నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ మారడమే కాకుండా మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారని దానం నాగేందర్ అంశాన్ని కోర్టుకు పిటిషనర్లు వివరించారు. స్పీకర్‌ను ఆదేశిస్తే రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ పూరిత వాతావర ణం ఏర్పడుతుందని ప్రభుత్వం తరుఫున న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. దానం, కడియం తరఫున శ్రీరఘురాం, మయూర్‌రెడ్డ్డి, జంధ్యాల రవిశంకర్ కోర్టులో వాదించారు.

పిటిషనర్ల తరఫున వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణలోకి తీసుకుంది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఎప్పుడు నోటీసులు ఇస్తారు, ఎప్పుడు విచారణకు పిలుస్తారు, ఎప్పటి నుంచి వాదనలు వింటారు, ఎప్పటి లోపు ప్రొసీ డింగ్స్ పూర్తి చేస్తారో వివరంగా షెడ్యూల్ తెలియ జేయాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగువారాల్లో షెడ్యూల్ రిలీజ్ చేయకపోయినా నిర్ణ యం ప్రకటించకున్నా తామే ఓ నిర్ణయం చెబుతామని హైకోర్టు పేర్కొంది.
పార్టీ మారిన ఎంఎల్‌లు వీరే : దానం నాగేందర్ – (ఖైరతాబాద్), ప్రకాష్ గౌడ్ – (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్ రెడ్డి – (పటాన్ చెరు), కాలె యాదయ్య – (చేవెళ్ల), అరికెపూడి గాంధీ – (శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – (గద్వాల్), ఎం సంజయ్ కుమార్ – (జగిత్యాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి – (బాన్సువాడ), తెల్లం వెంకట్రావు – (భద్రాచలం), కడియం శ్రీహరి – (స్టేషన్ ఘన్‌పూర్).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News