Wednesday, January 22, 2025

టాపర్లు దూరం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఎంసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే ఇంజినీరింగ్ ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో చాలామంది ఈ కౌన్సెలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఆదివా రం వరకు మొత్తం 81,856 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోగా, అందులో 66,215 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ ఎంసెట్‌లో ఒకటి నుంచి 200 ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో ఒ కరు కూడా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోలేదు. అలాగే 201 నుంచి 300 ర్యాంకు పొందిన వారి లో ఒక్కరే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, 301 నుంచి 400 ర్యాంకు పొందినవారి ముగ్గురు ఆప్ష న్లు ఎంపిక చేసుకున్నారు. ర్యాంకు పొందిన వారిలో 14మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, వెయ్యి లోపు ర్యాంకులు పొందిన వి ద్యార్థులు 104 మంది మాత్రమే ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు.

అలాగే 2వేల లోపు ర్యాంకు పొం దిన వారిలో 495 మంది, 5వేల లోపు ర్యాంకులు పొందిన వారిలో 2,293 మంది ఇంజినీరింగ్ కౌ న్సెలింగ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోగా, ఆ తర్వాత ర్యాంకులు పొందిన వారు ఎక్కువ మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భా గంగా ధ్రువపత్రాల పరిశీలన ముగియగా, ఈ నె ల 12 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నెల 16వ తేదీన మొ దటి ఇంజినీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిలో అధిక శాతం ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రవేశాలు పొందేందుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
కన్వీనర్ కోటాలో 76,359 సీట్లురాష్ట్రంలో 155 ఇంజినీరింగ్ కాలేజీలు, 16 యూ నివర్శిటీ కాలేజీలు, రెండు ప్రైవేట్ యూనివర్సిటీలలో కన్వీనర్ కోటా కింద 76,359 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో వచ్చాయి.

వీటిలో సిఎస్‌ఇ లో అత్యధికంగా ప్రైవేట్ కాలేజీల్లో 20,429 సీట్లు అందుబాటులో ఉండగా, యూనివర్శిటీ కాలేజీల్లో 1,074 సీట్లు ఉన్నాయి. మరో 14, 565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది. అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగతా సీట్లు మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో కాలేజీలు భర్తీ చేసుకుంటాయి.

కంప్యూటర్ సైన్స్‌కే అధిక డిమాండ్
ప్రస్తుతం ఇంజినీరింగ్ అంటేనే సిఎస్‌ఇ అనేలాగా పరిస్థితి మారిపోయింది. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌కు ఉన్న డిమాండ్ ప్రస్తుతం పతాక స్థాయికి చేరింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం ఈ విభాగంలోనే పిల్లలను చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. విస్తృతమైన ఉద్యోగావకాశాలు లభిస్తుండడం, ఇతర బ్రాంచ్‌లతో పోలిస్తే సాఫ్ట్‌వేర్ రంగంలో వేగవంతమైన వృద్ధి ఈ ధోరణికి కారణమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు సిఎస్‌ఇకే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటున్నారు. పదేళ్ల క్రితం వరకు మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇఇఇ బ్రాంచ్‌లకు డిమాండ్ ఉండేది. సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన ఉద్యోగ అవకాశాలు, కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలతో క్రమంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. డిమాండ్‌కు అనుగుణంగా కాలేజీలు, యూనివర్శిటీలు సైతం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఏటా సీట్లు పెంచుకుంటున్నాయి. దీంతో సిఎస్‌ఇ బ్రాంచీలో ఏటా సీట్లు పెరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News