Thursday, January 23, 2025

జోరు వానలో హైడ్రామా…

- Advertisement -
- Advertisement -
బిజెపి ముఖ్యనేతలు గృహ నిర్భందం
రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌కు కిషన్‌రెడ్డి ఫిర్యాదు
రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణుల నిరసన కార్యక్రమాలు

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న బిజెపి నేతల అరెస్ట్ హైడ్రామా చోటుచేసుకుంది. గురువారం ఉదయం జోరు వానలో బిజెపి శ్రేణులు పెద్ద సంఖ్యలో బాట సింగారం వెళ్లేందుకు సిద్ధం కాగా.. ముఖ్య నేతలను వారి నివాసాల వద్ద గృహ నిర్భందం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద నుంచి బయలుదేరిన కిషన్ రెడ్డి.. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న బిజెపి కార్యకర్తలు, నాయకులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు వెల్లడించారు. దాదాపు రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది. అనంతరం కిషన్‌రెడ్డిని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వదిలిపెట్టారు.
ముఖ్యనేతల గృహనిర్భంధం
డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు బిజెపి ముఖ్య నేతల్ని గృహా నిర్బంధం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శాసనసభ్యులు ఈటల రాజేందర్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా ముఖ్యనేతలను గృహ నిర్భంధం చేశారు.
రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌కు కిషన్‌రెడ్డి ఫిర్యాదు
బాటసింగారంలో కేంద్ర నిధులతో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళ్తున్న తన పట్ల అమానవీయంగా పోలీసులు ప్రవర్తించారని రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్లకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. గురువారం ఆయన లిఖితపూర్వకంగా తెలంగాణ పోలీసులు వ్యవహారించిన తీరుపై రాష్ట్రపతికి, లోక్ సభ స్పీకర్‌కు లేఖలో వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణుల నిరసన కార్యక్రమాలు
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో అరెస్టును ఖండిస్తూ బిజెపి కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. బిఆర్‌ఎస్ తీరును వారు ఎండగట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News