Sunday, December 22, 2024

మండలిలో హైడ్రామా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : శాసనమండలిని అగౌరవ పరిచే విధంగా సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ సభ్యులు శుక్రవారం మండలిలో నిరసనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో వాడీవేడి చర్చ జరుతుం డగా వారు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్‌రెడ్డి వెంటనే కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు చెప్పాలని అప్పటి వరకు మండలిని నిర్వహించొద్దని వారు అడ్డుకున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిల నిరసనపై కాంగ్రెస్ ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి స్పందించారు. కౌన్సిల్‌ను గులాబీ పార్టీ సభ్యులు అగౌరవపరుస్తున్నారన్నారు. ఆ పార్టీ ఎంఎల్‌సిలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారని, పెద్దల సభలో ఓపిక ఉండాలని సూచించా రు. మరో వైపు వారికి ఈ విషయంలో నిరసన చేపట్టే హ క్కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ నేతల చిట్టా మా దగ్గర ఉంది, ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు, అన్నీ బయటకు తీస్తామని జూపల్లి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపకుండ అడ్డుకోవడం మంచిది కా దని, సభ గౌరవం పాటించకపోవడం సబబు కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అయినా బిఆర్‌ఎస్ కౌన్సిల్ పోడియాన్ని చుట్టుముట్టడంతో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 10 నిమిషాల పా టు సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సిఎం రేవంత్‌రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి భానుప్రసాద్ ఆరోపించారు. వెం టనే సిఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన రేవంతరెడ్డి, ఇలాంటివి మాట్లాడ కూడదని ఆయన అన్నారు. మరోసారి గులాబీ పార్టీ ఎంఎల్‌సిలు కౌన్సిల్ పోడియాన్ని చుట్టుముట్టి అందోళన చేపట్టారు.
సిఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారికి వివరించారు. అయినా వారు నిరసన ఆపకపోవడంతో మండలిని మరోసారి వా యిదా వేశారు. కాగా, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి మోతె శోభన్ రెడ్డి సభలోకి నల్ల కండువాలను తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల కండువాలు వేసుకొని రావడానికి వేల్లేదని నిలువరించారు. దీంతో ఎంఎల్‌సిలకు, మార్షల్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎంఎల్‌సిలు భాను ప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ సభలోకి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News