Thursday, January 23, 2025

అమెరికా పార్శిల్‌లో హైగ్రేడ్ గంజాయి

- Advertisement -
- Advertisement -

ఎన్‌సిబి అదుపులో ఇద్దరు నిందితులు

Cannabis Seized In LBNagar At Rangareddy
మనతెలంగాణ/హైదరాబాద్: అమెరికా నుంచి ఓ కొరియర్ సంస్థకు వచ్చిన పార్శిల్లో 1.42 కిలోల హైగ్రేడ్ గంజాయిని గుర్తించిన ఎఎన్‌సిబి అధికారులు సోమవారం నాడు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్ యూనిట్ ఎన్‌సిబి అధికారులకు పక్కా సమాచారం అందడంతో కొరియర్‌లో వచ్చిన బాక్స్‌ను తనిఖీ చేశారు. దీంతో 1.42 కేజీల గంజాయితో బాక్స్‌ను ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హైగ్రేడ్ గంజాయి విలువ మార్కెట్లో రూ.15 లక్షల వరకు ఉంటుందని ఎన్‌సిబి అధికారులు పేర్కొన్నారు. కాగా పార్శిల్‌లో పట్టుబడ్డ గంజాయి కాలేజి విద్యార్థులు, వివిధ సంస్థల్లో పనిచేసే ఆఫీషల్స్‌కు విక్రయిస్తున్నట్లు ఎస్‌సిబి అధికారుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో ఎన్‌సిబి అధికారులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు గతంలో అమెరికా నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలకు సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. కేవలం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వివిధ మార్గాల్లో గంజాయి సరఫరాకు పాల్పడుతున్నారని, నిందితులు గతంలో కూడా పలు రకాల డ్రగ్స్‌ను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.కళాశాల విద్యార్థులే లక్ష్యంగా దందా కొనసాగుతోందని, ముఖ్యంగా డార్క్ నెట్ ద్వారా గంజాయిని నిందితులు ఆర్డర్ చేస్తున్నారని ఎస్‌సిబి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News