మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25న కమి టీ సమావేశం జరుగుతుందన్నారు. సికింద్రాబా ద్ అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తీసుకొ చ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నించారన్నారు. మంటలు పక్క వ్యాపించకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అ గ్ని ప్రమాదానికి గురైన భవనం లాంటివి 25 వేల వరకు హైదరాబాద్‌లో ఉండవచ్చునన్నారు.
శుక్రవారం బిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యుడు ఎం. గోపాల్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ, సికింద్రాబాద్‌లోని డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయిందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే నిర్మాణాలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. నగరంలో వెలిసిన అక్రమ కట్టడాలను రాత్రి రాత్రికి తొలగించలేమన్నారు. డెక్కన్ మాల్ భవనంలో కెమికల్స్ ఉన్నందున మంటలు త్వరగా అదుపులోకి రాలేదన్నారు. మాల్ నాణ్యతపై వరంగల్ నిట్ నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని తెలిపారు.