- Advertisement -
న్యూఢిల్లీ: మార్చి 9న అనుకోకుండా పేల్చిన క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో 124 కిమీ. దూరంలో పడిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ‘సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు క్షిపణి పేలింది’ అని గత వారం భారత్ అంగీకరించింది. పార్లమెంటులో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించింది. అధికారికంగా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. విచారణలో క్షిపణి పేలుడు ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుంది’ అని తెలిపారు. అంతేకాక ఆయన ‘ఈ సంఘటన నేపథ్యంలో కార్యకలాపాలు, నిర్వహణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను సమీక్షిస్తున్నాం’ అని కూడా ఆయన చెప్పారు.
- Advertisement -