Thursday, January 23, 2025

గ్రంథాలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తుందని, నిరుద్యోగ యువతకు మంచి పుస్తకాలతో పాటు రుచికరమైన భోజనం వసతి కూడా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. జిల్లా గ్రంథాలయ ఆవరణలో కాంపిటేటివ్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న మహిళా అభ్యర్థులు చదువుకోవడానికి నిర్మాణం చేసిన అదనపు షెడ్‌ను మంగళవారం విద్యా దినోనత్సవం జరుపుకుంటున్న రోజున మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరీక్షలు, పోటీ పరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న యువతకు గ్రంథాలయం నందు మధ్యాహ్న భోజనం వసతి ఏర్పాటు చేసిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంధాలయంలో ప్రతి రోజు 200 మంది యువకులు, 120 మంది మహిళలు పోటీ పరిక్షలకు ప్రిపేర్ అవడానికి వస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ,చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, డిసిఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్య యాదవ్, పెద్దగట్టుచైర్మన్ కోడి సైదులు, కౌన్సిలర్లు తాహెర్ పాషా, నిమ్మల స్రవంతి, కో ఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, రియాజుద్దీన్, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్య, కుంభం రాజేందర్, సయ్యద్ సలీం, గ్రంధాలయ కార్యదర్శి సీతారామ శాస్త్రి, లైబ్రేరియన్‌లు శ్యామ్ సుందర్ రెడ్డి, రంగారావు, విజయ భాస్కర్, సృజన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News