Monday, December 23, 2024

స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

High priority to sports in Telangana

క్రీడాకారులకు తగిన ఆదరణ పెరిగింది
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : స్వరాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని, క్రీడాకారులకు తగిన ఆదరణ పెరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు పోటీలను బోయినపల్లి వినోద్‌కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయస్థాయి కరాటే, కుంగ్‌ఫు పోటీలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహాం కల్పించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News