Wednesday, January 22, 2025

ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు

- Advertisement -
- Advertisement -
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

జగదేవ్‌పూర్: ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు సాధించవచ్చని ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పిటి వెంకటాపూర్ గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో దాదాపు 50 ఎకరాల విస్తరణలో మూడు లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు తమ పంటలలో ఆయిల్ పామ్ మొక్కలు పెట్టాలనుకుంటే పీటీ వెంకటాపూర్ నర్సరీలో మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రైతుల పోలాలకు సాగునీరును అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.

రైతులు అధిక లాభాలను ఇచ్చే పంటలను వేసుకోవాలన్నారు. ఒక ఎకరం సాగునీరులో నాలుగు ఎకరాల ఆయిల్ పామ్ పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. ఆయిల్ పామ్ పంటల ద్వారా ఎకరానికి లక్ష నుండి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. జిల్లాలో పిటి వెంకటాపూర్, రంగనాయక సాగర్, ములుగు నర్సరీలలో దాదాపు 10 లక్షల ఆయిల్ పామ్ మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అద్యక్షుడు కిరణ్‌గౌడ్, పిటి వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆ హ్మద్, వెంకటనర్సు, కనకయ్య రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News