Saturday, November 23, 2024

ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు

- Advertisement -
- Advertisement -

జగదేవ్ పూర్ : ఇతర పంటలకన్న ఆయిల్ ఫామ్ సాగు మేలు అని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. శుక్రవారం బస్వాపూర్ గ్రామంలో సాగు చేసిన ఆయిల్ పామ్ పత్తి, వరి, జీలుగ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకొని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ను సాగు చేయాలన్నారు. ఆయిల్ పామ్ పంట పెట్టిన నాలుగు సంవత్సరాల నుండి ఆదాయం వస్తుందని చీడపీడల పెట్టుబడి ఇతర పట్టలతో పోలిస్తే చాలా తక్కువ అన్నారు.

వరి పంటను ఒక నెల ముందు వేసుకుంటే ఆకాల వర్షాలు, వడగండ్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం 140 రోజులు అంతకన్న ఎక్కువ కాల వ్యవధి గల వరి రకాలను వేయవద్దని 120 నుంచి 125 రోజుల కాల వ్యవధి గల రకాలను వేసుకోవాలని రైతులను కోరారు. అలాగే వరి నాట్లు వేసి 30 నుంచి 40 రోజుల తర్వాత భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుందని చౌడు తగ్గుతుందని తెలిపారు. పత్తి విత్తే రైతులు 60 మిమీ వర్షం పడ్డ తర్వాత విత్తనాలు వేసుకోవాలని సూచించారు. పోడి దుక్కిలో పెట్టరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, వ్యవసాయ విస్తీరణ అధికారి కిరణ్ కుమార్, అయిల్ ఫెడ్ పీల్డ్ అఫీసర్ విజయ్, రైతులు నరసింహారెడ్డి, గ్రామ కో ఆర్డీనేటర్ ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News