Friday, April 4, 2025

హైరైజ్ బాద్

- Advertisement -
- Advertisement -

దేశంలోకెల్లా ఎత్తయిన భవనాలున్న్న
నగరాల్లో హైదరాబాద్‌కు రెండో స్థానం

ముంబై తర్వాత మనమే..

48 నుంచి 59 అంతస్తుల ఎత్తయిన నిర్మాణాలు అధికంగా పుప్పాలగూడ, కోకాపేటలోనే..

2029లో పూర్తికానున్న పుప్పాలగూడలోని 59 అంతస్తుల భవనం
ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో అ భివృద్ధి ఆకాశమే హద్దుగా దూసుకెళుతుందని ము న్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్నారు. ఎత్తయిన భవనాల నిర్మాణంలో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ముంబై తర్వాత పెద్ద బిల్డింగ్‌లను కట్టడంలో మనమే మొదటిస్థానంలో నిలిచామని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. జంట నగరా ల్లో 48 నుంచి 59 అంతస్తుల్లో ఎత్తయిన భవనాల నిర్మాణం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

అతి ఎత్తయిన భవనాల ప్రణాళికలకు ఆమోదం తెలిపినట్లుగా ఆయన వివరించారు. ఆమోదం పొందిన టాప్-10 ఎత్తయిన భవనాల్లో కోకాపేట, నియోపాలిస్ ప్రాంతంలోనే ఐదు భవనాల ని ర్మాణం జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. టాప్-10 టాలెస్ట్ బిల్డింగ్‌లకు సంబంధించిన ప్రాజెక్టు పేరు, లొకేషన్, ఎన్ని అంతస్తులు, అనుమతులు ఎ ప్పుడు జారీ అయ్యాయి? వంటి వివరాలను కూడా అందులో ఆయన పోస్టు చేశారు. పుప్పాలగూడలో 59అంతస్తులతో భవన సముదాయం 2029 మార్చినాటికి పూర్తవుతుందని అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News