Monday, December 23, 2024

ఓ బాలవ్వ ఎటు పోతున్నావ్.. జర పయలం

- Advertisement -
- Advertisement -

వరంగల్ రూరల్: జిల్లాలోని గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలో ఓ వృద్ధురాలు ‘మన తెలంగాణ’ విలేకరికి మండు టెండలో కనిపించింది. దీంతో ఆ అవ్వకు అతను జాగ్రత్తలు వివరించారు. ఈ వారం రోజులు ఎండలు బాగా కొడుతాయి. జర ఆరోగ్యం జాగ్రత్త.. ఎటూ వెళ్లకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు అని ఆ అవ్వకు చెప్పాడు.

అటు తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాల్లో 45.4 డిగ్రీలు, కరీంనగర్ లో 45.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కాడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు, హైదరాబాద్ లో కూడా 42 డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండలు దంచి కొడుతున్నాయ్. మీరు కూడా జర పయలంగా ఉండండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News