Wednesday, January 22, 2025

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జియూకెటిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా శాంతియుతంగా ఉన్న క్యాంపస్ లో బబ్లు పియుసి 1 విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో బుధవారం ముందస్తుగా ట్రిపుల్ ఐటీ ముఖ ద్వారం వద్ద ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి సంఘాలు లోనికి చొరబడకుండా భారీగా కేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీని బుధవారం టిజెఎస్ విద్యార్థి నాయకులు ముట్టడించారు. భారీ గేడ్లను తప్పుకొని లోపలికి దూసుకెళ్లి ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి చదువుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్షం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.

నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ రావు పటేల్, కార్యకర్తలు ట్రిపుల్ ఐటీని ముట్టడించారు. కళాశాలలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా ప్రధాన గేటు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఆత్మహత్యక పాల్పడ్డ విద్యార్థి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చూసేందుకు వెళుతున నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ విద్యాశాఖ అధికారులు ట్రిపుల్ ఐటీ గురించి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు పటేల్ బుధవారం భైంసా పట్టణ కేంద్రంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లు మృతి పట్ల విచారణ వ్యక్తం చేస్తూ బిజెపి నాయకులు ట్రిపుల్ ఐటీ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ముథోల్ నియోజకవర్గ బిజెపి నేతలైన మోహన్ రావు పటేల్, రామరావు పటేల్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News