Friday, November 15, 2024

గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొత్త సచివాలయానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రారంభానికి సిద్దమవుతున్న రాష్ట్ర కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే కొత్త సచివాలయాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరేందుకు యత్నించాయి. నూతన సెక్రటేరియట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై నిజ నిర్ధారణ జరగాలంటూ నిరసనకు దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహన్‌రెడ్డి,

నేతలు చామల కిరణ్‌రెడ్డి, అనిల్ యాదవ్, జిహెచ్‌ఎంసి కాంగ్రెస్ నాయకులు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, సుధీర్‌రెడ్డి, మెట్టు సాయికుమార్, వెంకటేష్ తదితరులు గాంధీభవన్ నుంచి సచివాలయానికి బయల్దేరేందుకు సన్నద్ధులయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లురవి, షబ్బీర్ అలీలను కూడా గాంధీ భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News