Wednesday, January 22, 2025

గ్రామసభలు రసాభాస

- Advertisement -
- Advertisement -

తొలి రోజు ఉద్రిక్తత, నిరసనలు అర్హులను
పక్కన పెట్టి అనర్హులను జాబితాలో
చేర్చారని అభ్యంతరాలు జాబితాల పేరుతో
సోషల్ మీడియాలో నకిలీ జాబితాలు
అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన
ప్రజలు పలు జిల్లాల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్
నేతల మధ్య వాగ్వాదం 4వేల గ్రామాల్లో
విజయవంతంగా గ్రామసభలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభలు రసాభస, ఉద్రిక్తంగా మారా యి. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభ లు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించే వార్డు సభల్లో నాలుగు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్దిదారులను ఎంపిక చేయనుంది. ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టాలనుకున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనలు, ఆందోళనలు, నిలదీతలు, ఉద్రిక్తతల మధ్య గ్రామ సభలు కొనసాగాయి. గ్రామసభల్లో రసాభాస, అర్హతలున్నా జాబితాలో తమ పేర్లు లేవని అధికారులపై కొందరు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు చేపట్టారు. అయితే జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో గ్రామస్థులు అధికారులను నిలదీశారు. దీంతో పలుచోట్ల గ్రామసభలు రసాభాసగా మారాయి.

అధికారులు, పోలీసులు కల్పించుకుని గ్రామస్థులకు సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. పలుచోట్ల గ్రామసభలను గ్రామస్థులు బహిష్కరించారు. జాబితాల్లో పేర్లు ఉన్న వారు ఆనందం వ్యక్తం చేస్తుంటే, పేర్లు లేని వారు అధికారులపై మండిపడుతున్నారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులను జాబితాలో నమోదు చేశారని దూషణ పర్వం చేశారు. అర్హులందరికీ పథకాలు వస్తాయని, పేర్లు రానివాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నా తమ వరకు వస్తాయో లేదో అనే భయాందోళనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో రేషన్ కార్డుల జాబితా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితా గురించి వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో వాటిలో తమ పేర్లు లేని పలు గ్రామాల్లో అనేకమంది గ్రామసభ వద్దకు చేరుకొని ఆ లిస్టులో మా పేరు ఎందుకు లేదని నిలదీశారు.

కొనసాగిన ఆందోళనలు, నిరసనలు, బహిష్కరణలు
పలు జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుంచి 24 వరకు చేపట్టిన గ్రామసభలు కరీంనగర్ జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో గ్రామ సభలో గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. అధికారులు, నాయకులు ఓపికగా గ్రామస్తులకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే కరీంనగర్ హుజురాబాద్ రూరల్ మండలం పరిధిలోని సింగాపూర్, చెల్పూర్, కందుగుల గ్రామాలలో ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ గృహాలలో, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ భరోసా, పథకాలలో అవకతకవలు జరిగాయని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. సింగపూర్ గ్రామంలో ఇందిరమ్మ భరోసా పథకంలో అవకతవకలు జరిగాయని మహిళలు గొడవకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలంలోని వేముల, కొత్తూరు, వెలుగోమ్ముల, బైరంపల్లి, దోనూరు, సింగంరెడ్డి గ్రామాల పరిధిలో గ్రామసభలు నిర్వహించగా పలుచోట్ల అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లబ్దిదారుల పేర్లు లిస్టులో రాకపోవడంతో అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలోని వందనం, బస్వాపురం, అనంతసాగర్, బొప్పారం, చింతకాని, చిన్న మండవ, నేరడ తదితర గ్రామాలలోఎక్కువ శాతం మేడలు, మిద్దెలు, కోట్ల రూపాయల ఆస్తులు వ్యవసాయ భూములు ఉన్న అనర్హులకే జాబితాలో చోటు దక్కిందని, నిరుపేదలైన లబ్ధిదారులు అర్హులుగా ఉంటే వారికి రాలేదని అధికారులపై గళమెత్తారు. మెదక్ జిల్లా జిన్నారం మండలంలో రసాభసగా మారింది. జిన్నారం మండలంలోని మంగంపేట గ్రామంలో జాబితాలో తమ పేర్లు లేవని అధికారులపై, నేతలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ 41వ డివిజన్‌లో గ్రామ సభ రసాభాస అయ్యింది. నిజామాబాద్ నగరానికి సంబంధించి మొత్తం 3,500 ఈ సంవత్సరం ఇస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇస్తారని గొడవకు దిగారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని నాగారం, సిద్దిపల్లి, పెంచికల్ పేట గ్రామాల్లో ప్రకటించిన జాబితాలో అర్హులైన వారి పేర్లను వెల్లడించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
సిద్ధిపేట జిల్లా సిద్దిపేట అర్బన్‌లో అనర్హులను జాబితాలో చేర్చారంటూ గ్రామస్తులు గ్రామసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నాలుగు పథకాలకు సంబంధించి వచ్చిన జాబితాను ప్రకటించడంతో గ్రామసభలో గందరగోళం నెలకొంది. అధికారులు మాట్లాడిన తర్వాత బీఆర్‌ఎస్ నాయకులు నాగుల ప్రశాంత్ లేచి కాంగ్రెస్ పథకాలపై పనితీరుపై విమర్శించడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఇరువురి మధ్యల కాసేపు వాదోపవాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా ఉమ్మడి శామీర్ పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, లక్ష్మాపూర్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితాను అధికారులు చదవగానే అర్హులైన నిరుపేదలకు పథకాలు మంజూరు కాలేదంటూ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెంట్లఏవెల్లి మండల పరిఏధిఏలోని గోపాఏలఏపూర్ గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభ గందఏరఏగోఏళంగా కొనఏసాఏగింది.

2023, 2024లో ఉపాధి హామి కింద పనిఏచేఏసిఏనఏటుఏవంటి కూలీలు వేతఏనాలు చెల్లింఏచిన తర్వాఏతనే గ్రామ సభ నిర్వఏహింఏచాఏలని అధిఏకాఏరుఏలను నిలఏదీసి అడ్డుఏకుఏన్నారు. ఈ సందఏర్భంగా పోలీఏసులు కల్పింఏచుఏకుని ఉపాధి కూలీ-లకు సర్ది చెప్పడం జరిఏగింది. కాగా జనగాం జిల్లాలోని చెన్నారావుపేట మండలం చెన్నారావుపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ కొంత మంది గ్రామస్థులు అధికారులను నిలదీశారు. దీంతో గ్రామసభలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను నిలదీశారు. గ్రామసభలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలోని సంగెం మండలంలోని గవిచర్ల, లోహిత గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అర్హులైన వారికి జాబితాలో పేర్లు రాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలో ప్రశ్నించడంతో అధికార పార్టీ నాయకులు తిరిగి బీఆర్‌ఎస్ పార్టీ గత పదేళ్లు ఏం పనులు చేయలేదని అనడంతో రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News