Sunday, December 22, 2024

కెటిఆర్ బామ్మర్ది ఇంటి దగ్గర హైటెన్షన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గంలోని మాజీ మంత్రి కెటిఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లేందుకు ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ప్రయత్నించారు. ఎక్సైజ్ అధికారులు, పోలీసులను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, నేతలు అడ్డుకుంటున్నారు. రాజ్ పాకాల ఇంటిదగ్గరకు బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. రాజ్ పాకాల ఇంటి ముందు బిఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బిఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

కొత్త ఇల్లు కట్టుకొని ఇటీవలే రాజ్ పాకాల గృహ ప్రవేశం చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు వివేకానంద, సంజయ్‌లు ప్రశ్నించారు. మితిమీరి పని చేసే అధికారుల చిట్టా రాసుకుంటున్నామని, సొంత ఇంట్లో పార్టీ చేసుకుంటే తప్పేంటి అని పోలీసులను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు నిలదీశారు. సొంత ఇంట్లో పార్టీ చేసుకోవద్దా అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News