Monday, April 14, 2025

మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు…. ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జల్‌పల్లిలో నటుడు మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం మోహన్‌బాబు ఇంటికి మంచు మనోజ్ తన భార్య పిల్లలతో కలిసి వెళ్లాడు. మోహన్‌బాబు ఇంటికి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపేశారు.  తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం చేస్తున్నారు. గేటు తీయకపోవడంతో ఇంటి ముందు మనోజ్ బైఠాయించారు. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పహాడీషరీఫ్‌ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తన కారు, విలువైన వస్తువులను దొంగలించారని మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ ఎత్తుకెళ్లారని విష్ణుపై మనోజ్ ఆరోపణలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News