Saturday, November 23, 2024

చంద్రబాబుకు హై టెన్షన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఐటీ షోకాజ్ నోటీసులపై విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఐటీ నోటీసులపై సెంట్రల్ హైదరాబాద్ కార్యాలయానికి నాలుగుసార్లు లేఖ రాసిన చంద్రబాబు.. తనకు ఐటీ నోటీసులు జారీ చేసిన తీరును తప్పుబడుతున్నారు.

అధికార పరిధి అధికారికి కాకుండా కేంద్ర కార్యాలయం నుంచి ఐటీ నోటీసు రావడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలు తెలుపుతూ ఐటీ కార్యాలయానికి రాసిన లేఖలను ఐటీ అధికారులు తిరస్కరించారు. తాజాగా మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే టీడీపీ హయాంలో.. అంటే 2016 నుంచి 2019 మధ్య ఇన్ ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల విరాళాలు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులను బడా ఇన్‌ఫ్రా కంపెనీలకు కట్టబెట్టి సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజల సొమ్మును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఆ లెక్కల్లో చూపని ఆదాయంపై ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది.

ఐటీ ఆడిట్‌లో నగదు ఎవరికి ఎలా చేరిందో కూడా ఉదాహరణలతో వివరించింది. దీన్ని నల్లధనంగా ఎందుకు గుర్తించలేదో చెప్పాలంటూ తాజాగా చంద్రబాబుకు మరో నోటీసు జారీ చేశారు. ఈ క్రమంలో లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్‌కు నగదు బట్వాడా చేసిన ఆధారాలను ఐటీ శాఖ పట్టుకుంది. ఐటీ నోటీసులపై విచారణను అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News