Sunday, December 29, 2024

దిలావర్పూర్‌లో ఉద్రిక్తత… పోలీసులపై రాళ్ల దాడి

- Advertisement -
- Advertisement -

నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు ఆందోళనలు చేపట్టారు.  61వ నెంబర్ జాతీయ రహదారిపై ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నాలుగు గ్రామాల రైతులు నిరసనలు తెలిపారు. మంగళవారం నుంచి స్థానికులు ఆందోళన చేస్తున్నారు. నిన్న ఆర్‌డిఒను నాలుగు గ్రామాల రైతులు నిర్భందించారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పురుగుమందు డబ్బాలతో మహిళలు నిరసన తెలిపారు. రోడ్లపైకి ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకొచ్చారు.  ఈ ఆందోళనతో 10 కిలోమీటర్ల మీర వాహనాలు నిలిచిపోయాయి. భైంసా నుండి వచ్చే వాహనాలను కల్లూర్, నర్సాపూర్ గ్రామాల నుండి నిర్మల్ వెళ్లడానికి మళ్ళించారు. నిర్మల్ నుండి భైంసా వెళ్లే వాహనాలను నాలుగు సిరివాపూర్ గ్రామం వద్ద నిలిపివేశారు. దీని వల్ల వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బందలు ఏర్పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News