Monday, December 23, 2024

గన్నవరంలో ఉద్రిక్తత… భారీగా మోహరించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసిపి, టిడిపి కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగిన విషయం తెలిసిందే. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదు చేసుకున్నాయి. టిడిపి నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో టిడిపి కార్యాలయంపై ఎంఎల్‌ఎ వల్లభనేని వంశీ అనుచరులు, వైసిపి కార్యకర్తలు దాడులు చేసి వీరంగం సృష్టించారు. స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఓ కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. వల్లభనేనిపై విమర్శలు చేస్తే ఎక్కువ దాడులు చేస్తామని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News