- Advertisement -
హైదరాబాద్ జలమండలి కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి కార్పొరేటర్లు మెరుపు ధర్నాకు దిగారు. కార్పొరేటర్లు చెత్త కుప్పలు తీసుకొచ్చి జలమండలి కార్యాలయంలో వేశారు. మంచినీటి పైపుల ద్వారా మంచినీటితో పాటు మురుగు నీరు సరఫరా అవుతుండటంతో కార్పొరేటర్లు నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు బిజెపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించారు. తోపులాటలో మల్కాజ్‌గిరి కార్పొరేటర్ తలకు తీవ్ర గాయమైంది.
Also Read: యజమాని కోసం ఎంత పని చేసింది… శునకాన్ని మెచ్చుకోవాల్సిందే
- Advertisement -