Wednesday, April 23, 2025

కర్రెగుట్టల్లో టెన్షన్..టెన్షన్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసుల
సంయుక్త ఆపరేషన్ 50వేల
మంది బలగాలతో జల్లెడ
మావోయిస్టులు, పోలీసుల మధ్య
ఘర్షణ వాతావరణం ఏజెన్సీ
ప్రాంతంలో అడుగడుగునా పోలీసులే
భయాందోళనలో ప్రజలు

మనతెలంగాణ/నూగూరువెంకటాపురం/వాజేడు, వెంకటాపురం: మావోయిస్టుల ఏరివేతలో భాగం గా చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల పోలీస్ బలగా లు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. తెలంగాణ స రిహద్దు ప్రాంతమైన చత్తీస్‌గఢ్ కర్రెగుట్టల్లో మావోయిస్టులు స్థావరాలు ఏర్పరచుకొని పోలీసులను టార్గెట్ చేస్తూ బాంబులు అమర్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అటువైపు గిరిజనులు ఎవరూ రాకూడదని మావోయిస్టులు ఇటీవల ఒక లేఖ వి డుదల చేసిన నేపథ్యంలో చత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసు బలగాలు సంయుక్త ఆపరేషన్‌లో 50 వేల మంది పోలీసులు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. దీనితో కర్రెగుట్టల అడవిలో భీకరపోరు మొదలైం ది. ములుగు జిల్లా, వాజేడు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడచూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికే మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను. అటునుంచి చత్తీస్‌గఢ్ పోలీస్ బలగాలు ఇటువైపు నుంచి తెలంగాణ పోలీస్ చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కర్రెగుటల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోనుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంద ని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవైపు కేం ద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 2025 సంవత్సరాంతానికల్లా మావోయిస్టులను పూర్తిగా మ ట్టుపెడతామని ప్రకటించిన విషయం విధేయతమే. ఈ నేపథ్యంలోనే పోలీసు బలగాలు సం యుక్త ఆపరేషన్ మొదలు పెట్టినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News