ఢిల్లీ: రైతుల గణతంత్ర పరేడ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రైతులు సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి ప్రవేశించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఢిల్లీలోని చొచ్చుకుని వచ్చారు. సరిహద్దుల వద్ద బారికేడ్లను దాటుకొని ఢిల్లీలోకి రైతులు ప్రవేశించిడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు యత్నిస్తున్నారు. పలుచోట్ల రైతులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. బాష్పవాయువు ప్రయోగంతో పొగలు దట్టంగా అలుముకున్నాయి. సంజయ్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్, అక్షర ధామ్ ఆలయం, ముకర్బా చౌక్ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. చివరగా రైతులను నిలువరించేందుకు జలఫిరంగుల వాహనాలను పోలీసులు తెచ్చారు. జలఫిరంగుల వాహనాలపై రైతులు ఎక్కి జాతీయ పతాకాలతో రైతులు నినాదాలు చేశారు. ముకర్బా చౌక్ వద్ద పోలీసు బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రైతులకు పోలీసులు సహకరిస్తున్నట్టు ఢిల్లీ సంయుక్త సిపి వెల్లడించాడు. రైతులు కూడా పోలీసులకు సహకరించాలని సంయుక్త సిపి విజ్ఞప్తి చేశారు.