- Advertisement -
దుద్వాల: వికారాబాద్ జిల్లా దుద్వాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అధికారుల భూసర్వే నిర్వహించారు. లగచర్లలో 200 మంది పోలీసులతో బందోబస్తుతో భూసర్వే చేపట్టారు. భూసర్వే చేయొద్దని రోటీబాండ తండాలో గ్రామస్థులు, స్థానికులు నిరసన తెలిపారు. నవంబర్ 11న లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణపై రైతుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పై అక్కడి రైతులు, ప్రజలు దాడి చేసిన విషయం తెలిసిందే. లగచర్లతో పాటు హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజీల కోసం 1,358 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో గ్రామస్థులను అరెస్టు చేసిన విషయం విధితమే.
- Advertisement -