Monday, December 23, 2024

పేట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత…. భారీ కేడ్లను తొలగించిన మల్లారెడ్డి అనుచరులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో  మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరుల మధ్య భూ వివాదం నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. స్థలంలో వేసిన భారీ కేడ్లను మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగిస్తుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎంఎల్ఎ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News