Tuesday, December 24, 2024

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈ రోజు జరగనున్న నిరుద్యోగ మహాదీక్షకు ఒయు విద్యార్థుల ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే నిరుద్యోగ మహాదీక్షకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. నిన్న సాయంత్రం నుంచే విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసేవేశారు. రేవంత్ ఇంటి వైపు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News