Thursday, January 23, 2025

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసకాండ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం 8.30 నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసకాండ కొనసాగుతోంది.  రైళ్లు, స్టాళ్లకు ఆర్మీ అభ్యర్థులు నిప్పుపెట్టారు. వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. రైళ్లపై రాళ్లు విసరడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల రాళ్ల దాడిలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రైళ్ల స్టాళ్లకు ఆర్మీ అభ్యర్థులు నిప్పు పెట్టారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే రైల్వే స్టేషన్ అగ్నిగుండంగా మారింది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలను యధాతథంగా నిర్వహించాలని ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఆర్మీ అభ్యర్థులు ఆకస్మిక దాడితో పోలీసులు చేతులెత్తేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News