Thursday, December 26, 2024

తుంగతుర్తిలో రణరంగం… గాదరి కిషోర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

- Advertisement -
సూర్యాపేట: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రుణమాఫీ చేయాలని ధర్నా చేస్తున్న గాదరి కిషోర్‌పై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని చేపట్టిన రైతు నిరసన దీక్షపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లతో, కోడి గుడ్లతో దాడి చేయడంతో బిఆర్ఎస్ నేతల కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ దాడిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఖండించారు. మహిళ జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులపై దాడి చేస్తున్నారని, ఇదేనా ప్రజా పాలన అని కెటిఆర్ ప్రశ్నించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News