Tuesday, April 1, 2025

హైటెన్షన్ వైర్లు తగిలి బస్సులో మంటలు.. ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సు హై ఓల్టేజ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అందులోని ఐదుగురు ప్రయాణికులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. మావ్ నుంచి మర్దా పోలీసు స్టేషన్ పరిధిలోని మహాహర్ ఆలయానికి పెళ్లి బృందం బస్సులో వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు ఎస్‌హెచ్‌ఓ ధర్మేంద్ర కుమార్ పాండే తెలిపారు. హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను బస్సు తాకడంతో బస్సులో మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News