Sunday, January 19, 2025

కంది సాగులో అధిక దిగుబడులు సాధించాలి

- Advertisement -
- Advertisement -
  • విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు : కంది సాగులో రైతులు అధిక దిగుబడులు సాధించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం రైతులకు కంది విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు కందిపప్పుకు దేశంలోనే పేరుపొందిందని అన్నారు. తాండూరు ప్రాంతంలో రైతులు కంది సాగుకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ప్రభుత్వం అందజేసిన కంది విత్తనాల సాగుతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఎంపిటిసిల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్‌చారి, బషీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, యాలాల మండల పార్టీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు రాములు, జనార్థన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నర్సింలు, శ్రీనివాస్‌చారి, రాంలింగారెడ్డి, నరేందర్‌రెడ్డి, అక్బర్‌బాబా, రమేష్, వ్యవసాయ అధికారి రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News