Tuesday, November 5, 2024

త్వరలో ఉన్నత విద్యాకమిషన్

- Advertisement -
- Advertisement -

ఈ పరిధిలోకి రాని మెడికల్, లా కాలేజీలు
పార్లమెంట్‌లో ఏకీకృత నియంత్రణ బిల్లు
నూతన విద్యావిధానంలోని ప్రతిపాదనే
కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఇప్పటి యుజిసి స్థానంలో కొత్త వ్యవస్థ

న్యూఢిల్లీ : దేశంలో ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఈ దిశలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఇసిఐ)ను నెలకొల్పుతారని, సంబంధిత హెచ్‌ఇసిఐ బిల్లును త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెడుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం తెలిపారు. అయితే ఈ హెచ్‌ఇసిఐ పరిధిలోకి మెడికల్, లా కాలేజీలు రాబోవని మంత్రి స్పష్టం చేశారు. ఓ వార్తా సంస్థకు కేంద్ర విద్యామంత్రి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఏర్పాటు అయ్యే ఉన్నత విద్యా కమిషన్‌కు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారని వివరించారు. నియంత్రణ, గుర్తింపు ప్రక్రియ, విద్యాపరమైన ప్రమాణాల స్థాపన వంటివి ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది.

ఇక విద్యా సంస్థలకు నిధుల పంపిణీ అనేది నాలుగో అంశం అవుతుంది. దీనికి హెచ్‌ఇసిఐకు ఎటువంటి సంబంధం ఉండదని, ఫండ్స్ సంబంధిత పూర్తి అధికారం సంబంధిత నిర్వాహక మంత్రిత్వశాఖపై ఉంటుందని వివరించారు. త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు . స్థాయి సంఘం పరిశీలన ఉంటుంది. ఇప్పటికే ప్రధానమైన పని పూర్తయిందని చెప్పారు. రెగ్యులేటరీ పాత్రలో భాగంగా ఇప్పుడు యుజిసి చేసే విధంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడున్న యుజిసి స్థానంలో క్రమేపీ ఈ కమిషన్ పరిగణనలోకి వస్తుంది. సంబంధిత విషయంలో అంతర్గతంగా సంస్కరణల ప్రక్రియ చేపట్టారు. రెండు స్థాయిలో విద్యాసంస్థలకు అక్రిడెషన్ కల్పిస్తారు.

కాలేజీలకు గుర్తింపు, వీటికి విద్యా సిలబస్‌లు, కోర్సుల ఖరారు జరుగుతుంది. ఈ విషయం పరిశీలనకు ఇప్పటికే డాక్టర్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. కమిటీ వెలువరించిన సిఫార్సులను పరిశీలిస్తున్నారు. ఇక మూడో స్థాయిలో విద్యాసంస్థల ప్రొఫెషనల్ స్టాండర్స్ రక్షించడం జరుగుతుంది. విద్యా సంస్థలలో బోధన ఏమిటీ? ఇది ఏ విధంగా ఉండాలనేది రూపొందించుకుంటారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఏర్పాటు అయ్యే హెచ్‌ఇసిఐ పరిధిలోకి మెడికల్, లా కాలేజీలు తప్పితే మిగిలిన కాలేజీలు అన్ని వస్తాయని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నూతన జాతీయ విద్యావిధానం (నెప్)లో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు ప్రతిపాదన ఉందని మంత్రి గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News