Monday, December 23, 2024

విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉన్నత విద్య అవకాశాలు

- Advertisement -
- Advertisement -
  • డిఎస్‌పి రమేష్‌కుమార్

సంగారెడ్డి టౌన్: విద్యార్థులు తమ కాలేజీ, పాఠశాలలో రోజుల్లోనే సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఇష్టంగా చదివి ఉన్నత విద్య అవకాశాలు సంపాదించుకోవాలని సంగారెడ్డి డిఎస్‌పి రమేష్ కుమార్ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని రాయల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఐఐటి జెఈఈలో ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అచీవ్‌మెంట్ ఉత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన డిఎస్‌పి మాట్లాడుతూ చదువులపై విద్యార్థులు ఇష్టాన్నీ పెంచుకొని చదివితేనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయన్నారు. నేటి సమాజంలో జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కష్టపడి చదివిన వారికి ఫలితం దక్కుతుందన్నారు. ప్రతిరోజు పోలీసులుగా తమకు ఎన్నో ఫిర్యాదులు వస్తాయని, వాటిని చూసినపుడు తమకు మనసు చలించి పోతుందన్నారు. విద్యార్థులు చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సోషల్ మీడియా చాటింగ్‌లతో మోసపోవద్దన్నారు. ఐఐటి, జెఈఈలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ కృపానిది, ఐఐటి ప్రొఫెసర్ గజేంద్రనాథ్, యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News