Thursday, January 16, 2025

విద్యారంగానికి అధిక ప్రాధాన్యం: తుమ్మల

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో కొత్త పుఢ్ మెనూను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి తుమ్మల భోజనం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామన్నారు. భావితరాలకు సరైన సదుపాయాలు కల్పిస్తే ప్రపంచాన్ని గెలుస్తారన్నారు. ప్రభుత్వం ఇబ్బందుల్లో విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచడంతో పాటు రూ.500 కోట్లు విడుదల చేశామన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఎ జారే ఆదినారాయణ, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News