Wednesday, December 25, 2024

అత్యధికంగా 26 రౌండ్ల కౌంటింగ్ జూబ్లీహిల్స్ లో !

- Advertisement -
- Advertisement -

తక్కువగా భద్రాచలంలో 13 రౌండ్లు కౌంటింగ్ !!

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో నేడు నిర్వహించే ఎన్నికల కౌంటింగ్‌లో ఎక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 26 రౌండ్లు లెక్కింపు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. తరువాత ఇబ్రహింపట్నం 25, కరీంనగర్ 25, యాకుత్‌పురా 25 రౌండ్లు చేయనున్నట్లు, తక్కువగా భద్రాచలంలో 13, అశ్వారావు పేట 14, చార్మినార్ 15, సికింద్రాబాద్ 16, కంటోన్మెంట్‌లో 17 రౌండ్లలో ఫలితాలు వెల్లడైతాయన్నారు.

ఎన్నికల ఫలితాలు అక్కడ విధులు నిర్వహించే సిబ్బందిపై ఆధారపడి ఉంటుందని, కొన్నిసార్లు ఓట్లు ఎక్కువ పోలైన నియోజకవర్గంలో ఆలస్యంగా ఫలితం వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం కౌంటింగ్ చేసే ఫలితాలు సాయంత్రం 5 గంటల వరకు పూర్తిగా వస్తాయని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News