Wednesday, January 22, 2025

ఆరునెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు ఆదివారం గణనీయంగా పెరిగాయి. ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3824 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు పెరగడం గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా క్రియాశీల కొవిడ్ కేసుల సంఖ్య 18,389 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొవిడ్ వెలుగు లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 4,47,22,605 కేసులు నిర్ధారణ అయ్యాయి. మృతుల సంఖ్య 5,30,881 కి చేరింది.

గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా ఐదుగురు కరోనా మూలంగా చనిపోయారు. ఢిల్లీ, హర్యానా, కేరళ, రాజస్థాన్‌లో ఒక్కరు చొప్పున మరణించారు. గతంలో చనిపోయిన ఒక వ్యక్తి మరణాన్ని కేరళ ప్రభుత్వం శనివారం లెక్కల్లో నివేదించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.87 శాతంగా, వారం రోజుల పాజిటివిటీ రేటు 2. 24 శాతంగా నమోదైంది. మరోవైపు రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News