Monday, December 23, 2024

ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం స్థానిక అమ్మకం పన్ను లేదా వ్యాట్ టాక్స్‌లే నని ఇంధన పరిశ్రమ డేటా చూపిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) ఈ మూడు ప్రభుత్వ అధీనం లోని ఇంధన రిటైలర్స్ గత వారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.2 వంతున తగ్గించాయి. దాదాపు రెండేళ్ల తరువాత ఈ ధరల సవరణ జరిగింది. ఈ తగ్గింపు ఇంధన వినియోగదారులకు కాస్త ఊరట కలిగించినా, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అత్యధిక విలువ ఆధారిత పన్ను (వ్యాట్ ) కారణంగా లీటరుకు రూ.100 కు మించి ధరలు పలుకుతున్నాయి.

వైఎస్ జగన్మోహనరెడ్డికి చెందిన వైఎస్‌ఆర్ సిపి పాలన లోని ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ లీటర్ రూ. 109.87 వంతున ధర పలుకుతోంది. తరువాత స్థానంలో కేరళ ఉంది. లెఫ్ట్‌డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) పాలన లోని కేరళలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.107.54 వరకు ఉంటోంది. కాంగ్రెస్ పాలిత తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ. 107.39 వరకు ధర పలుకుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ విషయంలో దూరంగా లేవు. భోపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.106.45, పాట్నాలో (బీజేపీజెడీయు సంకీర్ణ ప్రభుత్వం) రూ.105.16, జైపూర్‌లో రూ.104.86, ముంబైలో రూ.104.19 వరకు పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పాలిత పశ్చిమబెంగాల్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 103.93, ఒడిశా (భువనేశ్వర్)లో 101.04, తమిళనాడు(చెన్నై)లో రూ.100.73, ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్)లో రూ.10037 వరకు పెట్రోల్ ధరలు పలుకుతున్నాయని డేటా వివరించింది.

ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాలు
అండమాన్ నికోబార్ దీవుల్లో రూ. 82, సిల్వస్సా, డామన్‌లో రూ. 92.3892.49 వరకు పెట్రోల్ లీటరు ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఇతర చిన్న రాష్ట్రాల్లో స్థానిక వ్యాట్ ఉన్నప్పటికీ, ఢిల్లీలో రూ. 94.76, పనాజిలోరూ. 95.19, ఐజ్వాల్ లో రూ. 93.68, గువాహటి లో రూ.96.12 వంతున లీటర్ పెట్రోల్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు చాలావరకు పెట్రోల్ ధరలు తక్కువగా ఉంటున్నాయి.

డీజిల్ ధరలు కూడా ఇదే దారి…
ఆంధ్రప్రదేశ్ ( అమరావతి) లో లీటర్ డీజిల్ ధర రూ. 97.6 వరకు ఉండగా, కేరళ రాజధాని తిరువనంతపురంలో లీటర్ డీజిల్ రూ. 96.41 ధర పలుకుతోంది. హైదరాబాద్‌లో రూ. 95.63, రాయిపూర్‌లో రూ. 93.31 వంతున లీటర్ డీజిల్ ధరలు ఉంటున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్ లో లీటర్ డీజిల్ రూ. 92.93 వరకు తక్కువ ధరకు దొరుకుతోంది. ఇదేస్థాయిలో ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో డీజిల్ లీటరు ధర రూ. 78 వరకు ఉండగా, ఢిల్లీలో మెట్రోనగరాలన్నిటికన్నా తక్కువ స్థాయిలో వ్యాట్ ఉండడంతో లీటర్ రూ.87.66కు డీజిల్ ధర పలుకుతోంది. గోవాలో రూ. 87.76 వంతున లీటర్ డీజిల్ లభిస్తోంది.

ధరల కోతపై సంస్థల వ్యాఖ్యలు
పెట్రోల్, డీజిల్ ధరల కోతపై బహుళజాతీయ సంస్థలు తమ స్పందన తెలియజేశాయి. అమెరికాకు చెందిన గోల్డ్‌మ్యాన్ సాక్స్ మూడు చమురు సంస్థల లాభాల మార్జిన్ లీటర్‌కు రూ. 1.72.7 నుండి రూ. 0809 వరకు తగ్గుతుందని పేర్కొంది. ఈ విధమైన ధరల తగ్గింపు ప్రభావం ముడి చమురు ధరలపై ఉంటుందని, బ్యారెల్‌కు దాదాపు 3.5 అమెరికా డాలర్ల వరకు ముడి చమురు ధరలు పెరుగుదలతో సమానమౌతుందని జెపి మోర్గాన్ వెల్లడించింది. స్వల్పంగా తగ్గించినట్టు కనిపించినా, చమురు మార్కెటింగ్ కంపెనీల రెవెన్యూపై వార్షిక స్థాయిలో రూ. 30,000 కోట్ల వరకు తగ్గుదల కనిపిస్తుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News